Tuesday, June 3, 2008

దీనికి అంతం ఎప్పుడు ?



ఏమిటి ఈ అన్యాయం ?
దీనికి ఏది పరిష్కారం?
ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఏమిటో అనుకున్న?
కానీ నఢి రొడ్డు మీద ఒక నారి ఇంకో నారి ని నగ్నం
చేస్తుంటేఅందరు ఒక నాటకాన్ని చుస్తునట్టు చూస్తున్నారు
ఎం ఉంది ఆమె లో అంత వింత ?
చిన్నప్పుడు మీ అమ్మ తన లో ఉన్న రక్తాన్ని తెల్లగా
మర్చి పాలు ఇచ్చిన స్తనలే ఏ కాదా అవి?
నువ్వు కామం తో చూస్తున్న ఆ చోటు ని జన్మస్థలం అని నీకు తెలియదా?
ఎంత జరిగిన అన్నిటిని మౌనం గా బరిస్తున్న ఓ స్త్రీ మూర్తి
నీకు నా అశ్రువులు తో అర్దిస్తున్న ఇకనైనా నీ మౌనాన్ని వదిలి
కామం తో కళ్ళు మూసుకు పోయిన ఈ కుళ్ళు సమాజానికి సమాధానం చెప్పు
అయిన నువ్వు ఎం సమాధానం చెప్పుతావు లె
నాయ్యం కోసం నాయ్యస్థలం కి పోతే
నిన్ను "నీతిమాలినది"అంటారు
చట్టం కోసం పోలీస్ స్టేషన్ కి పోతే
అక్కడ నిన్ను "పోరంబోకుది "అంటారు
మానం కాపాడమని మానవతావాదులని
అడిగితేని నీ మానాన్ని మానికలు లెక్కన అమ్మేస్తారు
వీటి అన్నిటిని ఎదురుకొని నువ్వు ఎం సమాధానం చెప్పు తావు లే?
(వరంగల్ లో జరిగిన ఒక సంగటన ను ఆధారం గా తీసుకొని రాసింది )

సౌందర్య ప్రదర్శన



ఇది ఏమిటి?
శునక ప్రదర్శన
సుమ ప్రదర్శన లా
పడతుల సౌందర్య ప్రదర్శనలా?
ఎంత గోరం కాకపోతే
నాజూకు నడుము కోసం మార్కులు కొన్ని
ఎతైన రోమ్ములకు మరి కొన్ని మార్కులు అంట

అర్ధ నగ్నం గా నాట్యం చేస్తుంటే
అవి చూసి చొంగ కార్చే నాలుకలు కలపోషకులు అంట?
అయిన దేశాల సరిహద్దులు గిచి నట్లు దేహలిని
ఎలా అవయవ స్పూర్తి గా విభజించింది ఎవరో?
అని అనుకొని నిజమైన అందం కోసం
నా కళ్ళు కళం రెండు చాలాసేపు వెతికాయి

నిండు వేసవి లో
గొంతు ఎడారి తడపడానికి
నీళ్ళు లేక కొన్ని మైళ్ళు నడిచిఒయాసిస్ ని ముంగిట్లో తెచ్చే వనిత
సహజసుందరి కాదా?
కొండలని రాళ్ళు గా కొట్టే అపుడు
మేని పై మెరిసే చమట చుకలే
ముత్యాల బిందువులు
నాట్లు వెసేట్టపుడు
కలుపు తీసే అపుడు
మణికట్టు చిర కట్టి సుర్యని కిరణాలు ని సైతం రత్నలు గా
మలుచుకొని తన మెడలో వేసుకున్న
ఆమె శ్రమ ప్రదర్శనకు సాటి ఎం అన్న వుందా ?
(మొన్న టీవీ లో చుసిన ఒక అందాల పోటి ని చూసి రాసింది)

Monday, June 2, 2008

ఎవరు నువ్వు ?



ఎవరు నువ్వు?
నీకు నేను ఏమి అవుతాను
యాంత్రికం మైన నేటి జీవితాలలో కూడా ఒక

మనిషి యొక్క యద లయ ను వినగాలిగావే
ఏమి చెప్పాను నీ గురించి
ఎన్ని బాధలు ఉన్న ఆకాశాన్ని అంటి పెటుకున్న చంద్రుడి లా

నీ పెదవులను వీడని దరహాసం
ఓటమి లో కూడా గెలుపుని చూడగల నీ వ్యకితిత్వం
నీ మాటలతో ఎవరిని అయిన మార్చ గల చైతన్యం
నీ కనురెప్పల సవ్వడి తో ఎదుట మనిషిని నవ్వించాలని నువ్వు చేసే ప్రయత్నం
తప్పు గా ఆలోచిస్తే తండ్రిలా మంధలిస్తావు
ఆపద ఉంది అని అన్నలా హెచ్చరిస్తావ్
అన్ని వేళల సలహా ఇచ్చే సన్నిహితుడులా ఉంటావ్
ఇంతకి నువ్వు ఎవ్వరు ?
నీకు నేను ఎం అవుతాను?