Wednesday, July 2, 2008

కన్నీళ్ళు




అరె
ఎక్కడ నుంచి వస్తున్నాయి
ఇన్ని కన్నీళ్ళు?
బీడు భూమి లాంటి నా చెక్కిళ్ళను చెమ్మ చెస్తున్నాయి
అమ్మ అసుపత్రి లొ ఆపద లొ ఉంది
అని తెలిసిన అణువైన చెలించలెదె
తన గుండెల మిద తనించుకున్న తాత
తిరిగి రాని లోకలకు వెళ్ళడు అని తెలిసిన
ఒక్క కన్నిటి బొట్టు కుడా నా కళ్ళను చెరలెదు
స్నెహితులకు నేను పంచిన ప్రేమ అభిమానలను
తూకలు వెస్తున్నా మౌనంగా ఆ తక్కెడ లో కుర్చొని అమ్ముడ పొయెనె
కాని నా కళ్ళలొ ఎన్నడు చెమ్మ ను చెర నివ్వలేదు
జీవితం లొ ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురు అయిన
నా కన్నిళ్ళకు ఆనకట్ట వెశానె కాని
ఎనాడు సరిహద్ధు ను దాటనివ్వలెధు
మరి ఎంటి ఈరొజు కొత్తగా
మా ఊరి కలువ ఆనకట్ట తెంచుకొని పొల్లాలను ముంచెస్తున్నట్టు
నన్ను బాధలొ ముంచెస్తునాయి ఈ కన్నీళ్ళు
దీనికీ కారణం నువ్వ మాట్లాడం లేదు అన?
లేక నేను అందరు ఉన్న ఎవరు లేని దాన్నిఅయినందుక?