Monday, July 7, 2008

మగవాడి మనస్సు



మగవాడి మనస్సు మగువ మనస్సు లా సున్నితం కాదా?
మరి మరుపు అంటే ఏంటో తెలియని
అటువంటి మనస్సుల తో
ఎందుకు మగువలకు ఈ ఆటలు?
తాను ప్రేమించిన పడతి పలకరిస్తేనే
తమ మనస్సులు పులకరించిపోతాయె
ఆమె దరహసనికి దాసొహం అంటరె
మరి అటువంటి వాళ్ళును ఇప్పుడు తప్పు చేశారు అంటున్నారు
ఎం తప్పుచేసారు?
నీ అనుమతి లేకుండనే నీ అదరలను అంటిపెట్టుకున్నడా?
లేక నీకు తెలియకుండనె నీ అవయవం లో
అణువు అణువు తనకు అర్పితం చేసావా?
కన్నవాళ్ళ కళ్ళు కప్పి తన కౌగిళ్ళలో బంది అయ్యినప్పుడు తెలియదా
నువ్వు తప్పు చేసావు అని?
అన్న కు అబద్దం చెప్పి తాను ఇచ్చే అతిధ్యం కు అరటపడ్డవు
నీ స్వరం వినడానికి ని సెల్లు బిల్లు కట్టించావు
ఇప్పుడు ఏమో ఈ తప్పులో నా తప్పిదం లేదు
అని తప్పించుకుంటునావు?
నువ్వు గాయపరిచింది కేవలం ఒక మగవాడి మనస్సే
కాదు నిన్ను మనసార ప్రేమించే ఒక మనిషి
మనస్సు అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు?

(ఇది కేవలం నా స్నేహితులకు జరిగిన వాటిని చూసి రాసిందే కానీ అందరు ఇలాగె ఉంటారు అని నా ఉదేశం కాదు )