ఏమిటి ఈ అన్యాయం ?
దీనికి ఏది పరిష్కారం?
ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఏమిటో అనుకున్న?
కానీ నఢి రొడ్డు మీద ఒక నారి ఇంకో నారి ని నగ్నం
చేస్తుంటేఅందరు ఒక నాటకాన్ని చుస్తునట్టు చూస్తున్నారు
ఎం ఉంది ఆమె లో అంత వింత ?
చిన్నప్పుడు మీ అమ్మ తన లో ఉన్న రక్తాన్ని తెల్లగా
మర్చి పాలు ఇచ్చిన స్తనలే ఏ కాదా అవి?
నువ్వు కామం తో చూస్తున్న ఆ చోటు ని జన్మస్థలం అని నీకు తెలియదా?
ఎంత జరిగిన అన్నిటిని మౌనం గా బరిస్తున్న ఓ స్త్రీ మూర్తి
నీకు నా అశ్రువులు తో అర్దిస్తున్న ఇకనైనా నీ మౌనాన్ని వదిలి
కామం తో కళ్ళు మూసుకు పోయిన ఈ కుళ్ళు సమాజానికి సమాధానం చెప్పు
అయిన నువ్వు ఎం సమాధానం చెప్పుతావు లె
నాయ్యం కోసం నాయ్యస్థలం కి పోతే
నిన్ను "నీతిమాలినది"అంటారు
చట్టం కోసం పోలీస్ స్టేషన్ కి పోతే
అక్కడ నిన్ను "పోరంబోకుది "అంటారు
మానం కాపాడమని మానవతావాదులని
అడిగితేని నీ మానాన్ని మానికలు లెక్కన అమ్మేస్తారు
వీటి అన్నిటిని ఎదురుకొని నువ్వు ఎం సమాధానం చెప్పు తావు లే?
(వరంగల్ లో జరిగిన ఒక సంగటన ను ఆధారం గా తీసుకొని రాసింది )