Wednesday, June 25, 2008

ఒరెయ్ సురిగాడీ కూతురు చెడిపోయింది అంటా?
ఊరు లో ఉన్న జనం అంత పోగు అయ్యరు
ఏ పాపం ఎరుగని నన్ను ఒక దోషి లాగా నలుగురు మధ్య లో నిల్చునబెట్టి
పదే పదే నువ్వు చెడి పోయవ్ అంటే దానికి అర్దం కూడా తెలియని నన్ను
మా అయ్యా అక్కరకు తీసుకున్న సమయం లో
ఆయన కళ్ళలో లోని ఎర్రదనం ఉదయిస్తున్న సుర్యడుని తలపించాయి
అయిన కళ్ళలో నుంచి వచ్చే ఒక్కొక కన్నిటీ చుక్క ని చూస్తూ ఉంటే
మొన్న మా ఉరిలొ అన్నల వచ్చి ఎరగువేసిగా ఎర్ర జెండా వర్షానికి తాడిచి
కన్నీరు పెట్టుకున్నట్లు ఉంది ఏమీ చెయ్యలేని మా అయ్యా
నన్ను ఎత్తుకొని తన శరీరం లో ఉన్న బలం అంత గొంతులోకి తెచ్చుకొని
నా కూతురు ఏ పాపం ఎరగదు అయ్యా అని నాలుగు దిక్కులు అరుచుకుంటూ
ఆ ఊరు ని వదిలి వెళ్ళిపోయాం
ఆ సమయం లో నన్ను ఓదార్చటానికి అమ్మ లేదు
నేను ఉన్న నీకు అని చెప్పడానికి అన్న లేడు
నా గోడు వినటానికి అక్కా లేదు
ఎక్కడికి వెళ్ళిన ఈ సమాజం నన్ను బ్రతకనివ్వడం లేదు
సూటి పోటీ మాటలతో నన్ను ప్రతి క్షణం వెదిస్తున్నారు
ఈ లోకం ని వదిలి వెళ్ళిపొదం అనుకున్న సమయం లో
ఎక్కడో ఒక మిత్రుడి పిలుపు "కామ్రెడ్" అని
ఆ ఒక పిలుపు నాలో కొండంత ధైర్యం ని ఇచ్చింది
బ్రతకాలి అనే ఆశ ను పెంచాయి నన్ను ప్రశ్నీంచిన ఈ జనని
తిరిగి ప్రశ్నీంచెల చెసింది
నా జీవితానికి ఒక అర్దం కూడా దొరికింది
(ఏమి తెలియని పసితనం లో కొన్ని మానవ మ్రుగల చెతిలో బలి అయిన చిన్నారి మనస్సు పడె ఆవేదన ఇది )

4 comments:

Unknown said...

nenu mee blog ni orkut nundi chusa...... aa profile visiting stuff undi kada ala chusa...
meeru cheppinadanni maa IITD NSS lo vesaru .....oka documentory
"Born into Brothels" ani.......
kani adantha ekkado bihar lo very very small village
I don't think ...the same is in our andra..... wat made u write dat...
but danlo meeru present chesina daanni chuste nizanga al undi anipistundi........
anyway it's a very nice element of poetry....u cud be a big social transformer.....

anamika said...

ofcourse it happened in andhra and news also came on it

hareelu said...

మీ బ్లాగ్ లో కవితలు బాగున్నాయి. కవితల్లో కంటెంట్ బాగుంది, flow బాగుంది, ఫీలింగ్స్ బాగున్నాయి, కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల flow దెబ్బతింటోంది.

మీ ఆర్కుట్ ప్రొఫైల్ చూసాను. చలం రచనలు అన్నీ చదివారా? చదవకపోతే తప్పనిసరిగా అన్నీ చదవండి. అయినా మైదానం, స్త్రీ చదివిన వాళ్లకి చెప్పక్కరలేదు. Still.... ఇంటరెస్ట్ ఉంటే చలం ఆర్కుట్ కమ్యూనిటీ లో ("తెలుగు సాహిత్యం") చేరండి http://www.orkut.co.in/Main#Community?cmm=8826845

రంగనాయకమ్మ పుస్తకాలు ఏమన్నా చదివారా? "రామాయణ విషవృక్షం" తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.

Pradeep said...

Excuse me..
actually,i have a question for u??

Wat made you write these kinda stuff..? are you been affected by reading these kind of stuff..or is there any pain behind ur writings,that you had suffered from..?